Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : జూన్ 17: 33/11 కేవీ చిప్పడ సబ్‌స్టేషన్‌లో యార్డ్ మెయింటెనెన్స్ పనులు మరియు అండర్‌గ్రౌండ్ కేబుల్ (U/G Cable) పనులు చేపట్టనున్న నేపథ్యంలో, ఈ నెల 18వ తేదీ (గురువారం) ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆపరేషన్ జోన్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సింహాచలం నాయుడు తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయం కారణంగా చిప్పడ, పాత మూలకుద్దు, ఆమనాం, జీరుపేట, అన్నవరం, పెదనాగమయ్యపాలెం, చిన నాగమయ్యపాలెం, పాతపాలెం, జీరుపాలెం, అసిపాలెం, నమ్మివాణిపాలెం, కంచేరుపాలెం తదితర ప్రాంతాల్లోని గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
Admin
Neti Sakshyam