Monday, 15 June 2026 03:16:51 PM

A.U న్యాయ కళాశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

Date : 21 February 2026 04:10 AM Views : 229

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : ఫిబ్రవరి 20 సాక్ష్యం షార్ట్ న్యూస్: ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాల లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంధర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య సీతామాణిక్యం తన ప్రసంగంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న జరుపుకునే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం పేదరికం, లింగ వివక్ష, నిరుద్యోగం మరియు సామాజిక అసమానతలను రూపుమాపి, అందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలనే అవగాహనను పెంచుతుంది.* ఇది మానవ హక్కులు మరియు సామాజిక రక్షణను ప్రోత్సహిస్తూ, సమాజంలో న్యాయం మరియు సమానత్వాన్ని స్థాపించడానికి ఐక్యరాజ్యసమితి చేపట్టిన ముఖ్యమైన దినోత్సవం అని తెలియ జేసారు. కళాశాల పూర్వ విద్యార్థిని శ్రీమతి రహీమున్నిసా బేగం రహీమున్నిసా బేగం న్యాయ కళాశాలకు వాటర్ డిస్పెన్సర్ను ఆమె విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యకరమైన క్యాంపస్ వాతావరణం కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబడింది. *ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. రాఘవయ్య, డా. చంద్రకళ, డా. పల్లవి పాల్గొన్నారు. న్యాయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :