Monday, 27 July 2026 03:43:41 PM

“మన ఐక్యతే బలం” – నాగవంశం రిజర్వేషన్ ఉద్యమం

Date : 02 May 2026 10:17 PM Views : 356

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 2: భీమునిపట్నం నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిజర్వేషన్ మార్పు కోసం కీలక కార్యక్రమం చేపట్టారు. నాగవంశం కులస్తులను ప్రస్తుతం ఉన్న BC-D కేటగిరీ నుండి BC-A కేటగిరీకి మార్చాలని కోరుతూ డెడికేటెడ్ BC కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా సరైన న్యాయం జరగలేదని, విద్యా మరియు ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు అత్యవసరమని తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, వసతి సదుపాయాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమం భీమునిపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయం (MPDO ఆఫీస్) వద్ద మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. పెద్ద సంఖ్యలో నాగవంశం సోదరులు, పెద్దలు, నాయకులు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు. “మన ఐక్యతే మన బలం” అంటూ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కంటుబుక్త ముత్యాలరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కంటుబుక్త రామానాయుడు, డైరెక్టర్లు గాడు సన్యాసినాయుడు, అప్పికొండ అనంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోశాధికారి సంకురబోతు సూరిబాబు, కనకల అప్పలనాయుడు, కంటుబుక్త సునీత, సుంకర లక్ష్మణరావు సహా పలువురు సభ్యులు హాజరయ్యారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :