Thursday, 16 April 2026 04:30:00 PM

బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలుపుదల

Date : 14 April 2026 07:39 PM Views : 73

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 14: విశాఖ జోన్-3 పరిధిలో లైన్ మెయింటెనెన్స్, చెట్లు కొమ్మలు నరికివేత పనుల నేపథ్యంలో ఏప్రిల్ 15 (బుధవారం) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 33/11 కేవీ చేపలుప్పడ సబ్‌స్టేషన్ పరిధిలోని చిలుకూరి లేఅవుట్, విలాసం, పెదుప్పాడ, చినుప్పాడ, గంగడిపాలెం, గోవుపేట, కొత్తూరు, చేపలదిబ్బడిపాలెం, బోయలూరు, పెదబస ప్రాంతాల్లో ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :