Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 23 :// భీమునిపట్నం రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొల్లి వెంకట అప్పారావు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.1,93,000 పరిహారం మంజూరైంది. సోమవారం ఉదయం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చిక్కాల విజయబాబు, జడ్పీటీసీ గాడు వెంకటప్పుడు, సర్పంచ్ వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam