Monday, 27 July 2026 04:20:06 PM

మరణానంతరం ఇద్దరికి వెలుగునిచ్చిన నేత్రదానం

Date : 11 May 2026 06:05 PM Views : 182

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ / పెందుర్తి : మే 11: పెందుర్తి పాతురు ప్రాంతానికి చెందిన పెతకం శెట్టి రాము (46) ఆదివారం రాత్రి ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర విషాదంలోనూ ఆయన కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో నేత్రదానానికి ముందుకు వచ్చారు. మృతుడి బావమరిది శరగడం సంతోష్, సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీనివాసరావును సంప్రదించి నేత్రదానానికి అంగీకారం తెలిపారు. సమాచారం అందుకున్న ఎల్వీ ప్రసాద్ మోహిసిన్ నేత్రనిధి టెక్నీషియన్లు మనోజ్, లక్ష్మి కార్నియాలను సేకరించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. “మనిషి మరణించిన తర్వాత కూడా నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు ప్రసాదించవచ్చు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా మృతుడి భార్య సత్యవతి, కుమారుడు త్రిమోతికి ప్రశంసాపత్రం అందజేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: