Monday, 14 September 2026 03:37:38 AM

భీమిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ చేసిన DCHS

Date : 07 July 2026 09:42 PM Views : 146

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూలై 7 : విశాఖపట్నం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నరేంద్ర సింగ్ మంగళవారం భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, ఓపీ (OP), ఐపీ (IP) సేవలు, ప్రసూతి వైద్య సేవల పనితీరుపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, ఔషధాల లభ్యత, సిబ్బంది పనితీరును సమీక్షించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. అలాగే ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ తనిఖీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. ఫణికుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: