Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : సెప్టెంబరు 2: భీమిలి జీవీఎంసీ 3వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షులు అల్లిపిల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో పెద్దబజారు, చిన్నబజారు, తోటవీధిలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎల్లాజీ, వాసుపల్లి కొండబాబు, పిన్నింటి ఎర్రయ్యరెడ్డి, వాడమొదుల జగ్గారావు, కొండ్రు రామసూరప్పడు, బూర నాగరాజు, మాజీ కౌన్సిలర్ మైలపల్లి లక్ష్మణరావు, అనపర్తి సూర్యప్రకాశరావు, పాసి వినోద్ కుమార్, పీతల శంకర్రావు, అప్పికొండ బాలకృష్ణ, గుండాసు మధునాయుడు, బాకీ రమణారెడ్డి, కుంకుపూడి ఎర్రిబాబు, వాసుపల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam