Tuesday, 25 August 2026 04:27:26 PM

రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు... అభివృద్ధి పనులకు శ్రీకారం!"

Date : 10 June 2026 06:33 PM Views : 168

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 10: భీమునిపట్నం మండలం అమనాం రెవెన్యూ గ్రామంలో "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 405 మంది రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అమనాం గ్రామ పరిధిలో మొత్తం 508 మంది రైతులకు పాస్ పుస్తకాల జాబితా సిద్ధం కాగా, మిగిలిన 103 పుస్తకాలు మ్యుటేషన్, ఫొటో మార్పులు, ఇతర సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా, రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సామాజిక భవనం, సీసీ రహదారిని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: