Saturday, 01 August 2026 05:45:32 AM

భీమిలీలో యువకుడు అనుమానాస్పద మృతి

Date : 21 February 2026 10:02 AM Views : 294

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 21 భీమునిపట్నం సాక్ష్యం షార్ట్ న్యూస్: భీమిలి లోని నోవోటెల్ హోటల్ సమీపంలో ఉన్న అనిల్ రాజా బీచ్ హోమ్స్‌లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు రాజన్న శ్యామ్ కుమార్ (26)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆయన సోదరుడు గతంలో Hyderabadలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడ పరిచయమైన యువతితో వివాదాల నేపథ్యంలో కేసు నమోదైంది. అనంతరం అరెస్ట్ భయంతో ఫిబ్రవరి 18న భీమిలికి వచ్చి రూమ్ నం.102లో దిగినట్లు సమాచారం. ఫిబ్రవరి 19 రాత్రి చివరిసారిగా కనిపించిన ఆయన, 20న మధ్యాహ్నం గది తలుపు తెరిచి చూడగా మృతదేహంగా కనిపించారు. గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు షర్ట్ కట్టిన ఆనవాళ్లు, మద్యం సీసాలు, ఎలుకల మందు ప్యాకెట్లు లభించాయి. సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: