Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 14: భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది యువ రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటిచెప్పారు. రక్తదానం చేసిన ప్రతి దాతకు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్లు అందజేసి వైద్య అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం ఘోష హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ ఎం. ఫణికుమార్, డాక్టర్ వినయ్ రాజా, డాక్టర్ కళ్యాణ్ శ్రీనివాస్, డాక్టర్ గోవింద్, హెడ్ నర్స్ వినూత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమునిపట్నం సీహెచ్‌సీ వైద్యాధికారి మాట్లాడుతూ, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశముందని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Admin
Neti Sakshyam