Wednesday, 16 September 2026 06:56:31 AM

పద్మనాభంలో విద్యుత్ ప్రమాదం ఇద్దరు మృతి

Date : 01 March 2026 06:45 PM Views : 565

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : మార్చి 1: ఒకే కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తిన విషాద ఘటన Padmanabham మండలంలో చోటుచేసుకుంది. పశువుల షెడ్డు నిర్మాణం సందర్భంగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... Isakalapalem గ్రామానికి చెందిన కాళ్ళ సూరీడు (65) తన కుమారుడు కాళ్ళ సూరిబాబు (41)తో కలిసి పశువుల షెడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల కోసం సహాయకుడిగా కంటుబోతు శ్రీను (41)ను నియమించుకున్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ క్రింద నిర్మాణం చేపట్టడం, పనుల సమయంలో విద్యుత్ తీగలు తాకడం వల్ల తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో కంటుబోతు శ్రీను (41), కాళ్ళ సూరీడు (65) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సూరిబాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: