Friday, 31 July 2026 12:06:31 AM

ఆధ్యాత్మిక నిధి – అనంత పద్మనాభుని సన్నిధి” పుస్తకావిష్కరణ

Date : 14 March 2026 07:19 PM Views : 355

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : మార్చి 14: భీమిలిలో “ఆధ్యాత్మిక నిధి – అనంత పద్మనాభుని సన్నిధి” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమక్షంలో రచయిత చెన్నా మృత్యుంజయరావు రచించిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రచురణకర్తగా తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేదుల నగేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వేదుల ఈశ్వరుడు, లక్ష్మీ రాజేశ్వరి దంపతులు పూలమాలతో సత్కరించారు. అనంతరం రచయితను, ప్రచురణకర్తను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కోరాడ రమణ, మాజీ ఎంపీపీ కాళ్ళ నగేష్ కుమార్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మొకర సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: