Thursday, 30 July 2026 11:16:36 PM

భీమిలిలో పాలీసెట్ 2026ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి…

Date : 23 April 2026 02:26 PM Views : 224

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 23: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్ష ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనుంది. భీమునిపట్నం పరిధిలో మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. భీమిలిలో 687 మంది, తగరపువలస పరిధిలో 557 మంది, మధురవాడలో 737 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. భీమిలిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు: SVLNS గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సీడార్ హై స్కూల్. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఆధార్ వంటి గుర్తింపు పత్రం, HB పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్, ఎరేజర్, షార్పనర్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 11 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ వివరాలను భీమునిపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపాల్ డాక్టర్ చి. మురళీకృష్ణ తెలిపారు. ???? మరిన్ని అప్‌డేట్స్ కోసం Neti Sakshyam Websiteను ఫాలో అవ్వండి.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: