Thursday, 05 March 2026 12:35:18 AM

శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈజిప్ట్ భక్తులు.

Date : 20 February 2026 08:51 PM Views : 114

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : ఫిబ్రవరి 20 సాక్ష్యం న్యూస్: నగరంలోని శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారి దేవాలయంలో నేటి సాయంత్రం నిర్వహించిన పంచామృతాభిషేక సేవ భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక పూజలో ఈజిప్ట్ దేశానికి చెందిన భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కానుకలు సమర్పించారు. పూజ కార్యక్రమం అనంతరం దేవాలయ వేద పండితులు, అమ్మవారి స్థల పురాణం, ఆలయ వైభవం, అమ్మవారి విశిష్టత, స్థానిక భక్తుల ఆరాధన సంప్రదాయాల గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. భాషా భేదం కారణంగా వారి వెంట వచ్చిన అనువాదకుల ద్వారా ఈ వివరాలను ఈజిప్ట్ భక్తులకు వివరించారు. అమ్మవారి ఆలయంలో విదేశీ భక్తులు కనిపించడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. భారతీయ సాంప్రదాయాలు, ఆలయ ఆచార విధానాలపై వారు ఆసక్తి వ్యక్తం చేయడంతో ఆలయ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. పంచామృతాభిషేక సేవ అనంతరం విదేశీ భక్తులు అమ్మవారి దర్శనం తీసుకుని ఆలయ వాతావరణాన్ని ప్రశంసించారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తోందని నిర్వాహకులు తెలిపారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :