Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : మే 19 : విశాఖపట్నం ద్వారకానగర్‌లోని బీవీకే కళాశాల సమీపంలో ఉన్న నిర్విన్ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఘటనలో విటుడు సత్యనారాయణ, మేనేజర్ లక్ష్మి, రిసెప్షనిస్ట్ రవితేజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
Neti Sakshyam