Monday, 14 September 2026 03:37:22 AM

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం : కాంగ్రెస్ నేత జగన్ మురారి విమర్శ

Date : 29 July 2026 11:45 AM Views : 146

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : జులై 29: దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నప్పటికీ, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండగా ప్రజల ఆదాయం పెరగడం లేదని, చిన్నా పెద్దా వ్యాపారాలు బలహీనపడుతున్నాయని, కుటుంబాలపై అప్పుల భారం అధికమవుతోందని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రతపై కూడా కార్పొరేట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. విద్య, పెట్రోలియం తదితర రంగాల్లో అవకతవకలు వెలుగుచూస్తున్నాయని, రాబోయే నెలల్లో దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దేశద్రోహ ముద్ర వేయడం సరికాదని, ప్రజలు వాస్తవ పరిస్థితులను గుర్తించి ప్రశ్నించాలని జగన్ మురారి పిలుపునిచ్చారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: