Tuesday, 25 August 2026 04:23:46 PM

కళింగ వైశ్యుల సమస్యలపై పోరాడాలి

Date : 11 August 2026 07:13 PM Views : 90

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : ఆగస్టు 11: కళింగ వైశ్యుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ సూచించారు. కళింగ వైశ్య బీసీ సౌత్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పట్నాన రమణతో పాటు కోమటి పెద్దలు మంగళవారం ఆసీలమెట్టలోని వాసుపల్లి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కళింగ వైశ్యులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో వాసుపల్లి ముందుంటారని కోమటి పెద్దలు కొనియాడారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి తమ వర్గం అండగా ఉంటుందని తెలిపారు. తన నియామకానికి సహకరించిన వాసుపల్లి గణేష్‌కుమార్‌కు పట్నాన రమణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కళింగ కోమటి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :