Monday, 15 June 2026 03:21:24 PM

భీమిలి బాలసదనంలో గంటా రవితేజ … పిల్లలకు ఎగ్జామ్ కిట్లు పంపిణీ

Date : 28 February 2026 07:52 PM Views : 280

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 28: భీమిలి లోని బాలసదనాన్ని గంటా రవితేజ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో ముచ్చటించి, వారి భోజనం, వసతి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. బాలసదనం సూపరింటెండెంట్ ఆర్. ఉర్మిల మరియు సిబ్బందితో మౌలిక సదుపాయాలపై చర్చించి, హోమ్ ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించారు. పిల్లలకు బట్టలు, ప్లాంక్స్, పెన్సిల్స్, పౌచ్‌లు, ఎగ్జామ్ కిట్లను పంపిణీ చేశారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఆనందంగా పరీక్షలు రాయాలని పిల్లలకు సూచించారు. అలాగే పరిశుభ్రమైన, సంతోషకర వాతావరణం కల్పించాలని సిబ్బందికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గంటా నూకరాజు, తెలుగుదేశం పార్టీ సభ్యులు, బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :