Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : ఆగస్టు 2: విశాఖ జిల్లా భీమిలి మండలం చిట్టీల అగ్రహారంలో యువకుల మందు పార్టీలో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం సేవిస్తున్న సమయంలో నిఖిల్ అనే యువకుడిపై మదన్ అనే యువకుడు బీర్ బాటిల్‌తో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో నిఖిల్‌కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం NRI ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఘర్షణకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Admin
Neti Sakshyam