Tuesday, 25 August 2026 05:12:35 PM

పుట్టిన రోజున బాటసారులకు చల్ల"ని వేడుక

Date : 11 April 2026 02:41 PM Views : 293

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : మార్చి 11: విశాఖ జిల్లా తగరపువలసలో ఓ యువ వ్యాపారి తన జన్మదినాన్ని వినూత్నంగా జరుపుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్థానికంగా మొబైల్స్ షాపు నిర్వహిస్తున్న కనకల నవీన్, “ బర్తడే కేక్ కట్ చేసి పార్టీలు చేసుకోవడం కన్నా మండుటెండలో బాటసారుల గొంతుకను చల్లబరిచే మజ్జిగ అందివ్వడమే మంచిదని భావించారు. దీంతో స్థానిక అన్నా కేంటీన్ ప్రక్కనే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.తన జన్మదినాన్ని వినోదంగా కాకుండా సేవగా మార్చిన నవీన్ ను పలువురు ప్రసంశిస్తున్నారు. అన్నా క్యాంటిన్ పక్కనే ఈ సౌకర్యం కలగడంతో అక్కడ భోజనం చేసిన వారు ఇక్కడ చల్లటి మజ్జిగను ఆస్వాదిస్తూ ఉష్ణ తాపాన్ని మర్చిపోతున్నారు. “ఇలాంటి సేవలు సమాజానికి ఎంతో అవసరం” అంటూ స్థానికులు అభినందిస్తున్నారు.వేసవి పూర్తయ్యే వరకు ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తానని నవీన్ స్పష్టం చేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :