Saturday, 01 August 2026 01:41:39 AM

జోన్ -1 భీమిలి కార్యాలయానికి కమీషనర్‌గా విజయ్ కుమార్

Date : 23 February 2026 04:50 PM Views : 266

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 23: భీమునిపట్నం జోన్–1 కమిషనర్‌గా మేకల విజయ్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌కు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. 2007 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఆయన ముంచంగిపుట్టు ఎంపీడీవోగా సేవలు ప్రారంభించారు. అనంతరం అరకు వ్యాలీ జాతీయ రూర్బన్ మిషన్ ఎంపీడీవోగా కీలక బాధ్యతలు నిర్వహించారు. విజయనగరం జిల్లా ఎస్.కోట, విశాఖ జిల్లా పాడేరు మండలాల్లో ఎంపీడీవోగా పనిచేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ జిల్లా కోఆర్డినేటర్, ఇన్‌చార్జ్ డిప్యూటీ సీఈవోగా, 2022లో జిల్లాల పునర్విభజన సమయంలో జడ్పీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. పద్మనాభం, శంఖవరం, చింతూరు ప్రాంతాల్లో కూడా వివిధ హోదాల్లో సేవలందించారు. తాజాగా భీమునిపట్నం జోన్–1 కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: