Tuesday, 15 September 2026 05:00:17 AM

భీమిలిలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. స్వర్ణ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

Date : 23 May 2026 11:10 PM Views : 208

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 23 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ భీమునిపట్నం జోన్ పరిధిలోని 3వ వార్డు తోటవీధి స్వర్ణ వార్డులో సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ లక్ష్యంతో మే 23 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భీమునిపట్నం జోనల్ కమిషనర్ మేకల విజయ్ కుమార్, సానిటరీ సూపర్వైజర్ బీ మహాలక్ష్మి నాయుడు, మేస్త్రి రవి, స్వర్ణ వార్డు కార్యదర్శులు, టిడిపి నాయకులు గొలగాని నరేంద్ర, గంటా నూకరాజు, కనకాల అప్పలనాయుడు, చురకల రమణ, గాడు సన్యాసినాయుడు, కాసారపు పెద్ద ఎల్లాజీ, అదపాక గురునాధరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతకు తమ వంతు సహకారం అందించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :