Tuesday, 15 September 2026 05:00:12 AM

ఒకే గ్రామంలో నలుగురు మృతి విషాదంలో బొత్సపేట.

Date : 28 July 2026 06:03 PM Views : 506

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : జులై 27: ఒకే కుటుంబానికి చెందిన తల్లికొడుకులుతో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొత్సపేటలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి విజయనగరం చెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లికొడుకులు మజ్జి నారాయణరావు(50), పైడితల్లి (65)తో పాటు అదే గ్రామానికి చెందిన చింతపల్లి రామానాయుడు (55) బొత్స మోహన్ నాయుడు (10) మృత్యువాత పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పోలీసులు గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొత్సపేట గ్రామానికి చెందిన 16 మంది బొలెరో వాహనంలో రాయగడకు వెళ్తుండగా చెల్లూరు జాతీయ రహదారిపై వాహనం ఆగింది, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బొత్సపేట గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా...మరొకరు విజయనగరం మహారాజా ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానిక మాజీ సర్పంచ్ చందక శ్రీనివాసరావు చొరవతో శవ పంచనామా అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చి వారి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు. పద్మనాభం మండల టిడిపి అధ్యక్షుడు కోరాడ రమణ,మరియు మాజీ యం.పి.పి గోపిబాబు మృతుల కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. స్థానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి వారికి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: