Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : ఏప్రిల్ 15: బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ పద్మనాభం ఉత్తమ ఫలితాలు సాధించింది. మొదటి సంవత్సరం 86% (30/35), ద్వితీయ సంవత్సరం 89% (24/27) ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రిన్సిపల్ కే. గ్రేస్ లిల్లీ తెలిపారు. మొదటి సంవత్సరంలో T. దివ్య (456/470) ప్రథమ స్థానం, A. త్రివేణి (448/470) ద్వితీయ స్థానం, D. ప్రసన్న (438/470) తృతీయ స్థానం సాధించారు. 400కు పైగా మార్కులు 10 మంది విద్యార్థులు పొందారు. ద్వితీయ సంవత్సరంలో M. సుస్మిత (969/1000) ప్రథమ స్థానం, K. సంజనా (926/1000) ద్వితీయ స్థానం, P. గాయత్రి (915/1000) తృతీయ స్థానం సాధించారు. మొదటి సంవత్సరం నుంచి 19 మంది, రెండో సంవత్సరం నుంచి 16 మంది విద్యార్థులు A గ్రేడ్ సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
Admin
Neti Sakshyam