Monday, 27 July 2026 03:44:56 PM

పదేళ్ల కృషికి ఫలితం.. భీమిలిలో కొత్త కోర్టు ప్రారంభం

Date : 03 May 2026 06:50 PM Views : 177

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 3: భీమునిపట్నంలో శాశ్వత సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎ.పి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలహరి హాజరయై ప్రారంభించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి, విశాఖ జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వెంకటరమణలు పాల్గొన్నారు.

భీమునిపట్నం తొలి సీనియర్ సివిల్ జడ్జిగా డి. సోని బాధ్యతలు స్వీకరించి కోర్టు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. జనార్థనరావు మాట్లాడుతూ, పదేళ్ల కృషి ఫలించి కోర్టు స్థాపన సాధ్యమైందని తెలిపారు. ఈ కోర్టు ఏర్పాటుకు సహకరించిన న్యాయమూర్తులు మరియు సంబంధిత వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :