Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ / గోపాలపట్నం : ఫిబ్రవరి 23 విశాఖపట్నంలోని గోపాలపట్నం రైతు బజార్ లో సోమవారం రైతులకు వినియోగదారుల చట్టాలు, బాల్య వివాహాల నిషేధం మరియు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్ మర్రి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలు తెలుసుకొని రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు అరికట్టాలని, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరపాలని చెప్పారు. పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సేవల కోసం 15100 నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్ రైతులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
Admin
Neti Sakshyam