Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూలై 29: గ్రేటర్ విశాఖ భీమునిపట్నం జోన్ పరిధిలోని పెద్ద బజారు వాణిజ్య సముదాయంలో ఖాళీగా ఉన్న షాపులను మూడేళ్ల కాలానికి గుత్తకు ఇచ్చేందుకు ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు భీమునిపట్నం జోనల్ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. వార్డు నెం.3లోని షాపు నెంబర్లు 1, 3, 8, 10, 11 (జనరల్ కేటగిరి), షాపు నెం.6 (ఎస్‌సీ కేటగిరి) వేలంలో పాల్గొంటాయి. ఆసక్తి గల వారు జీవీఎంసీ నిబంధనల మేరకు హాజరుకావాలని, పూర్తి వివరాలు భీమిలి జోనల్ కార్యాలయంలో పొందవచ్చని సూచించారు.
Admin
Neti Sakshyam