Friday, 31 July 2026 12:59:06 AM

భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఉద్యోగ విజయోత్సవం

Date : 28 March 2026 03:50 PM Views : 197

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 28: భీమునిపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో “ఉద్యోగ విజయోత్సవం” (Job Achievers Day) కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ ద్వారా విద్యార్థినులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. MosChip Technologies, Tata Electronics, HMI Engineering Services, Dykin Technologies వంటి ప్రముఖ సంస్థల్లో ట్రైనీ ఇంజినీర్లుగా నియామకాలు పొందిన విద్యార్థినులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమునిపట్నం మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ విజయ్ కుమార్, HMI Engineering Services సీఈఓ దినేష్, ఏఎస్‌ఐ నూక రాజు హాజరై విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులకు నియామక పత్రాలు అందజేశారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని, ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను కొనసాగించాలని అతిథులు సూచించారు. కార్యక్రమానికి విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా హాజరై ఆనందాన్ని వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మురళీ కృష్ణ, ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ అధికారి జి. కాంతారావు మరియు విభాగాధిపతులు విద్యార్థినులను అభినందించారు. ఈ విజయోత్సవం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచింది.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: