Thursday, 30 July 2026 11:18:39 PM

తగరపువలసలో కూలి రేట్ల పెంపు డిమాండ్

Date : 14 April 2026 07:23 PM Views : 155

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 14: తగరపువలసలో కూలి రేట్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో కొత్త రేట్లు నిర్ణయించాలని సిఐటియు ముఠా కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం వర్తక సంఘం అధ్యక్షుడు దుర్గ మురళికి సిఐటియు భీమిలి జోన్ అధ్యక్షుడు ఆర్ఎస్ఎన్ మూర్తి వినతి పత్రం అందించారు. రెండు సంవత్సరాలుగా నిత్యావసరాల ధరలు పెరగడంతో కార్మికుల జీవనభారం పెరిగిందని, ప్రస్తుత కూలి రేట్లు సరిపోవడం లేదని పేర్కొన్నారు. వెంటనే చర్చలు నిర్వహించి కూలి రేట్లు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ రమణరెడ్డి, సిహెచ్ సత్యనారాయణ, ఎం ఈశ్వరరావు, కె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: