Tuesday, 15 September 2026 05:26:44 AM

కేజీబీవీ విద్యార్థిని భువనేశ్వరి ప్రతిభకు బహుమానం

Date : 08 March 2026 05:11 PM Views : 333

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం సిటీ పోలీస్ ఆధ్వర్యంలో బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పద్మనాభం పోలీస్ టీం ఆధ్వర్యంలో ముందుగా పలు పోటీలు నిర్వహించినట్లు కేజీబీవీ పద్మనాభం ప్రిన్సిపాల్ గ్రేస్ లిల్లీ తెలిపారు. ఈ పోటీలలో కేజీబీవీ పద్మనాభం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని భువనేశ్వరి డిబేట్ పోటీలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఆమెకు బహుమతిని పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, డీసీపీ–1 మణికంఠ చందోలు, డీసీపీ–2 (లా అండ్ ఆర్డర్) మేరీ ప్రశాంతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రేమకుమార్, ఏపీసీ డా. జె. చంద్రశేఖర్, జీసీడీఓ జి. శ్రీదేవి విద్యార్థినిని అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచాలని వారు సూచించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: