Monday, 27 July 2026 04:20:24 PM

తిరుమల శ్రీదేవిని అభినందించి సత్కరించిన రవితేజ

Date : 17 May 2026 07:07 PM Views : 349

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 17: సింగపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు, భీమిలి నెహ్రూ స్కూల్ ప్రధానోపాధ్యాయులు తిరుమల శ్రీదేవి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరై అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశారు.మే 2 నుంచి 9వ తేదీ వరకు జరిగిన సెమినార్లలో పాల్గొని మే 10న ఆమె తిరిగి భీమిలి చేరుకోగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ ఆమె నివాసానికి వెళ్లి సింగపూర్ విద్యా విధానం, అక్కడ అమలవుతున్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యాస విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక పాఠశాలల్లో కూడా అలాంటి ఉత్తమ విధానాలను ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో ఆమె అందిస్తున్న సేవలను అభినందిస్తూ గంటా రవితేజ శ్రీదేవికి సన్మానం చేయగా, కేజీబీవీ స్కూల్ కమిటీ చైర్మన్ కూడా పాల్గొని ఆమెకు అభినందనలు తెలిపారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: