Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : జూన్14: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, పద్మనాభం విద్యార్థినులు కే. సుప్రియ, ఆర్. దీక్షిత కళ్యాణి ఐఐఐటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో సీట్లు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా డీఈఓ ఎన్. ప్రేమ్ కుమార్, ఏపీసీ డా. జె. చంద్రశేఖర్, జీసీడీఓ జి. శ్రీదేవి, ఎంఈఓ బాబులాల్ రమణ విద్యార్థినులను, ప్రిన్సిపాల్ గ్రేస్ లిల్లీతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. విద్యార్థినుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Admin
Neti Sakshyam