Friday, 01 May 2026 03:25:14 AM

స్వచ్ఛతతో పాటు పచ్చదనానికి అడుగులు – భీమిలిలో మొక్కల నాటే కార్యక్రమం

Date : 29 April 2026 10:32 AM Views : 36

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 29: జి.వి.యం.సి వార్డు-3 తోట వీధి స్వర్ణ వార్డు ఆవరణలో స్వచ్ సర్వేక్షన్ కార్యక్రమం భాగంగా జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ… స్వచ్ఛతతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించవచ్చని ఇందుకోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ బి. మహలక్ష్మీ నాయుడు, మలేరియా ఇన్స్పెక్టర్ ఎస్. సూరిబాబు, పబ్లిక్ హెల్త్ మేస్త్రి ఆర్. రవి, వార్డు పారిశుధ్య మరియు పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :