Tuesday, 15 September 2026 05:27:43 AM

భీమిలి కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో స్టెమ్ ల్యాబ్‌

Date : 21 February 2026 04:34 PM Views : 290

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 21 భీమునిపట్నం కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో స్టెమ్ ల్యాబ్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ ఐటీ సంస్థ Infosysకు చెందిన కిషోర్ దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈ స్టెమ్ ల్యాబ్‌ను ఆయన చేతుల మీదుగానే ప్రారంభించారని ప్రిన్సిపాల్ శ్రీమతి గంగా కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో Nirmaan Organization సీఈఓ మయూర్ మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ఎక్కువ ప్రాజెక్టులు చేయాలని, భవిష్యత్తులో ఈ విద్యాలయానికి దాతలుగా మారాలని సూచించారు. ఆదర్శ భావాలు, విలువలు కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. విద్యార్థినులు కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదిగి ఇన్ఫోసిస్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యాలయం యాజమాన్య కమిటీ చైర్మన్ చందవరపు కుమార్ స్టెమ్ ల్యాబ్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చివరిలో కిషోర్, మయూర్ మరియు నిర్వాహక బృంద సభ్యులకు సన్మానాలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాన్ ఆర్గనైజేషన్ టీమ్ సభ్యులు సౌమ్య, యశ్వంత్, ప్రసాద్, దుర్గా ప్రసాద్, సందీప్, విద్యాలయం ఇంచార్జి ప్రమీల, సైన్స్ ఫ్యాకల్టీ స్రవంతి, సంతోషి, పావని, శాంతి, మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: