Monday, 14 September 2026 03:36:32 AM

వెంకటాపురంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు!

Date : 04 September 2026 08:52 PM Views : 148

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ / రేవిడి : సెప్టెంబరు 4: విశాఖ జిల్లా పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టే సంబరం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ కర్రి రమణ, ఎంపీటీసీ సీర సూరప్పడ్డు, మాజీ ఎంపీటీసీ అవాల గంగరాజు, కర్రి సన్యాసప్పడు, డీలర్ కర్రి శ్రీను పాల్గొన్నారు. అల్లు బంగారబాబు, కర్రి శ్రీగణేష్ ఆధ్వర్యంలో వెంకటాపురం యూత్ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో కృష్ణాష్టమి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శ్రీకృష్ణుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :