Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : మే 15: కులం కాదు... మనసే గొప్పదని మరోసారి చాటిచెప్పింది నాగవంశ కమ్యూనిటీ. తగరపువలస విశ్వం గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన విశాఖ జిల్లా నాగవంశ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభ మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయి చికిత్స పొందుతున్న అప్పురుభుక్త రాజీకి అండగా నిలిచిన అడహక్ కమిటీ సభ్యులు బుగత నర్సింగరావు, కంటుబోతు శ్రీనివాసరావు, నింగబోతు జనార్దన్‌రావులు కలిసి రూ.50 వేల ఆర్థిక సాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. అంతేకాదు... విద్యే సమాజ అభివృద్ధికి పునాది అన్న సందేశంతో 550కి పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణ, విశాఖ జిల్లా అధ్యక్షులు గాడు వెంకటప్పడు, ముని మోహన్ కృష్ణ, జనరల్ సెక్రటరీ నల్లి రవి కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నింగిబోతు రఘు, రాష్ట్ర డైరెక్టర్లు కంటుబోతు ముత్యాలరావు, గాడు తాతినాయుడు, కాళ్ల నగేష్, కంటుపోతు రామానాయుడు, సన్నీబాబు, శ్రీను, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నాగవంశ కమ్యూనిటీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
Neti Sakshyam