Saturday, 01 August 2026 01:41:39 AM

భీమిలి మహిళా పాలిటెక్నిక్‌లో పాలీసెట్‌కు ఉచిత శిక్షణ

Date : 31 March 2026 08:48 PM Views : 279

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 31: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ (POLYCET) పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం భీమునిపట్నం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. మురళీకృష్ణ తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఏప్రిల్ 4, 2026 నుండి ఏప్రిల్ 22, 2026 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షకు అవసరమైన కోర్స్ మెటీరియల్‌ను కూడా విద్యార్థులకు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. భీమునిపట్నం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన పదో తరగతి ఉత్తీర్ణులు లేదా ప్రస్తుతం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాలీసెట్ పరీక్షకు ఇప్పటికే దరఖాస్తు చేసిన లేదా దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులని వెల్లడించారు. పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఏప్రిల్ 4, 2026గా నిర్ణయించబడినందున, ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. శిక్షణలో పాల్గొనదలచిన విద్యార్థులు ఏప్రిల్ 4వ తేదీ నుండి నేరుగా కళాశాలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: