Wednesday, 16 September 2026 06:11:07 AM

అనకాపల్లిలో పేకాట శిభిరంపై పోలీసులు దాడి

Date : 21 February 2026 10:55 AM Views : 202

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / అనకాపల్లి జిల్లా : ఫిబ్రవరి 21 నక్కపల్లి సాక్ష్యం షార్ట్ న్యూస్: నక్కపల్లి మండలం సెట్టిబలిజిపేట శివారులో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఇన్‌స్పెక్టర్ మురళి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. పోలీసులు ఘటనాస్థలంలో నుంచి ₹11,460 నగదు, 3 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. జూదానికి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :