Monday, 14 September 2026 03:50:16 AM

నేటి నుండి ఏపీలో తీవ్ర వడ గాల్పులు

Date : 19 May 2026 12:26 PM Views : 226

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : మే 19 : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి వడగాలుల ప్రభావం తీవ్రం కానుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో ప్రారంభమయ్యే వేడి, ఉక్కపోత క్రమంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరించనుంది. రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలు ఈ నెల 26 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :