Monday, 14 September 2026 03:36:29 AM

పద్మనాభం గోస్తనీలో ఘనంగా గురుపూజోత్సవం

Date : 05 September 2026 07:44 PM Views : 177

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 5: గురువును మించిన దైవం మరొకరు లేరని, విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయులను గౌరవించడమే వారికి ఇచ్చే నిజమైన బహుమతి అని పద్మనాభం ఎంపీపీ కంటుబోతు రాంబాబు అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభంలోని గోస్తనీ విద్యాపీఠ్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలలో పని చేస్తున్న 15 మంది ఉపాద్యాయులను ఘనంగా సత్కరించడం తోపాటు స్కూల్ అసిస్టెంట్లుగా పదవీ విరమణ చేసిన కాళ్ళ అక్కులు, రేవళ్ళ వెంకట నారాయణ, గోరుగుంతల బాస్కర శంకర్రావులను ఘనంగా సన్మానించి యం.పి.పి రాంబాబు చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసారు.ఈ సందర్భంగా గురువుల గొప్పతనాన్ని కొనియాడుతూ రాంబాబు మాట్లాడారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ నిర్మాణంలో వారి సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కాళ్ళ మనోహర్ మరియు స్కూల్ సిబ్బంది యం.పి.పి రాంబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాద్యాయులు బోని సన్యాసినాయుడు, ఉపాద్యాయులు కాళ్ళ శ్రీనువాసు, ప్రధానోపాధ్యాయులు V శంకర్రావు మరియు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :