Wednesday, 16 September 2026 06:11:55 AM

భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NTR జయంతి.

Date : 28 May 2025 02:00 PM Views : 958

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : మే 28 సాక్ష్యం న్యూస్: తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని భీమిలి ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి.సురేఖ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ అసాధారణ జీవితం, దూరదృష్టి కలిగిన నాయకత్వం, కళాత్మక ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ పై చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు.తెలుగు గడ్డపైకి ఎన్నో సంస్కరణలు తెచ్చిన తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గొప్పవిషయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ శ్రీ బి ప్రసాద్ రావు, ఎక్డమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి సహదేవుడు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: