Thursday, 30 July 2026 11:18:10 PM

అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రపంచానికి తెలియాలి

Date : 25 October 2024 01:44 PM Views : 1273

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలూరు/కొయ్యలగూడెం : దెందులూరు అక్టోబర్ 25: సాక్ష్యం న్యూస్, డా ,బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను అందరికీ తెలిసేలా పాఠశాలలు, కళాశాలలో పాఠ్యాంశంగా చేర్చాలని అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కండ్రిగ నర్సాపురంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశం ఔన్నత్యాన్ని ఇనుమడింప చేసేలా దేశ పరిపాలన ప్రపంచానికి ఆదర్శవంతంగా జరిగేలా ప్రణాళిక బద్దంగా శ్రమించి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుని జీవిత విధానం భారతావనికి ఆదర్శప్రాయం అన్నారు. నేటి యువత ఆయన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మద్దతు లేఖలు ఇవ్వాలని కోరారు. తాము సంతకాల సేకరణతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రం పంపుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దాన మాండ్రు మధుబాబు చిలకా హరీష్ సరిపల్లి మహేష్ గులిమే హరిబాబు భీమడోలు రామకృష్ణ చిలక విష్ణు నాగు వసంత్ వంశీ మహేష్ చిలక వంశి తాని గడప సంతోష్ చిలక పవన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :