Wednesday, 16 September 2026 06:11:43 AM

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ వినతి

Date : 10 December 2024 05:27 PM Views : 1545

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : డిసెంబర్ 10, సాక్ష్యం న్యూస్: పేద ముస్లిం విద్యార్థుల విద్యాభివృద్ధికి వసతి ఏర్పాట్లులతో ఆదునిక టెక్నాలజీతో 8 రకాల భాషలతో విద్యాభివృద్ధికి తాము సేవా భావంతో పాఠశాలను నడిపిస్తున్నామని దెందులూరు మండలం జోగన్నపాలెం సమీపంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చారిటబుల్ స్కూల్ ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షులు మౌలానా మొహమ్మద్ వసవుల్లా సాహెబ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. అందరికీ ఉపయోగపడే పాఠశాల అభివృద్ధికి మరింత సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాఠశాల వద్ద ఎంతో కాలంగా డ్రైనేజీ సమస్య వెంటాడుతోందని, దీనిపై తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన MLA చింతమనేని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: