Friday, 06 March 2026 04:45:03 PM

గోపన్నపాలెంలో సెయింట్ ఫ్రాన్సిస్ గ్లోబల్ స్కూల్

Date : 10 December 2024 09:22 AM Views : 1394

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : డిసెంబరు 10 సాక్ష్యం న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పాఠశాల లను నిర్మించి, డిజిటల్ విధానంలో పిల్లలకు పాఠాలను చెప్పడం చెప్పుకోదగ్గ విషయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని నవ్యమ్మ అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం పంచాయతి పరిధిలో నూతనంగా నిర్మించిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల ప్రారంబోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అథిదిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఏలూరు ఆర్ సీఎం పీఠాధిపతి పొలిమేర జయరావు,దెందులూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు)సెయింట్ ఫ్రాన్సిస్ గ్లోబల్ స్కూల్ కరెస్పాండెంట్ బ్రదర్ జోసఫ్ కుమార్ లు రిబ్బన్ కత్తిరించి ప్రారంబించారు. జిల్లాలోని మరెక్కడా లేని విధంగా ఐ. సి. ఎస్ .ఈ సిలబస్ తో నర్సరీ నుండి మూడో తరగతి వరకు కూడిన ఇక్కడ భవన సముదాయం ఆకర్షణీయంగా ఉందన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ గ్లోబల్ స్కూల్ సంస్థల ప్రొవెన్షియల్ బ్రదర్ అలెగ్జాండర్. వైస్ ప్రొవెన్షియల్ బ్రదర్ టైటాస్. కౌన్సిల్స్ మరియదాసు జోసఫ్ పిటి. పౌల్ డీజోజా లు డిజిటల్ రూమ్ లను ప్రారంభించారు.గోపన్నపాలెం గ్రామం తో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్చి సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :