Monday, 24 August 2026 05:13:44 AM

విభిన్న రుచులతో 9 విలేజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ దాబా

Date : 25 October 2024 03:18 PM Views : 1355

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : భీమడోలు అక్టోబర్ 25 సాక్ష్యం న్యూస్ యువత చదువుతో పాటు వ్యాపార రంగాల్లో కూడా రాణించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం కుర్రెళ్లగూడెం పూళ్ల గ్రామాల పరిధిలో జాతీయ రహదారి పక్కన 9 విలేజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు దాబాను ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వహకులు ఆలపాటి యశ్వంత్ ,షేక్ మహమ్మద్ షరీఫ్ లను అభినందించారు. వినూత్న పద్ధతిలో సంప్రదాయ పద్ధతిలో నాణ్యమైన వంటలతో విభిన్న రుచులను అందించడం గొప్ప విషయమన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు,పూళ్ల సహకార సంఘం బ్యాంకు మాజీ అధ్యక్షులు టిడిపి నేత గన్ని గోపాలరావు, మాజీ సహకార సంఘం బ్యాంక్ అధ్యక్షులు రాయపాటి సత్యనారాయణ చాట్రాయి సత్యనారాయణ మూర్తి,ఆలపాటి అనిల్, ఆలపాటి రామారావు,తదితరులు పాల్గొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :