Monday, 24 August 2026 05:12:36 AM

వ్యాయామ విద్యా కళాశాలలో ఫ్రెషర్స్ డే

Date : 30 October 2024 04:49 PM Views : 1494

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు :

అక్టోబర్ 30:సాక్ష్యం న్యూస్, విద్యార్థులంతా సీనియర్ ,జూనియర్అనే తేడా లేకుండా చక్కగా కలిసి మెలిసి వ్యాయామ విద్యను అభ్యసించాలని ర్యాగింగ్ భూతం జోలికి వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని దెందులూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు . గోపన్నపాలెం గ్రామం మాజీ సర్పంచ్ మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు) అన్నారు. బుధవారం దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నతానియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వాగతం పలికకే ఫ్రెషర్స్ డే ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు తాసిల్దార్ బి సుమతి, గోపన్నపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతా సుబ్బారావు,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ మిల్లు బాబు,ఉపాధ్యాయులు డాక్టర్ దిలీప్, డాక్టర్ డి రత్నబాబు,లయన్స్ క్లబ్ జిల్లా ఆఫీస్ బేరర్ ఎల్ వెంకటేశ్వరరావు, టిడిపి నేతలు మారగాని సత్యనారాయణ, ఏనుగు( కేబుల్ శ్రీను). కోలంటి లక్ష్మి భవాని, ప్రసాద్, తెలుగు యువత నేత చందు,మాజీ సర్పంచ్ కొండేటి హనుమంతు, టిడిపి జనసేన భాజపా నేతలు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: