Wednesday, 12 August 2026 07:57:20 PM

థాయ్‌లాండ్ లో తగరపువలస మిఠాయిలు

Date : 21 December 2024 03:29 PM Views : 2621

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ తగరపువలస : డిసెంబరు 21 సాక్ష్యం న్యూస్ : పత్తేపారం.. సవక.. సవక.. అంటూ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేని ప్రపంచ యాత్రికుడు తన యాస భాషతో అందరినీ నవ్విస్తున్న 'నా అన్వేషణ' యూట్యూబ్ ఛానల్ 'అన్వేష్' చేతిలో మన ఆంద్రా పిండి వంటలతో పాటు విశాఖ జిల్లా తగరపువలస శ్రీ మణికంఠ స్వీట్స్ & బేకరీ ప్యాకెట్ ఉండటం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో కాలంగా తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ...ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టుముట్టే అన్వేష్' తాజాగా థాయిలాండ్ వేదికగా తన తల్లిదండ్రులను కలుసుకున్నారు. తన కొడుకును చూడ్డానికి భీమిలి నుంచి థాయిలాండ్ చేరుకున్న అన్వేష్' తల్లిదండ్రులు కొడుకు కోసం అనేక తినుబండారాలను తీసుకెళ్లారు. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్న నేపథ్యంలో అన్వేష్ చేతిలో స్థానిక శ్రీ మణికంఠ స్వీట్స్ ప్యాకెట్ కనిపించడంతో..MFC అభిమానుల కళ్ళల్లో ఆనందం కనిపించింది. మరోవైపు భీమిలి ప్రాంతం రాయప్పాలెం గ్రామస్తుడైన అన్వేష్' ప్రపంచ యాత్రికుడు కావడం పట్ల స్థానికులు చాలా గొప్పగా చెప్పకుంటుండగా... థాయ్‌లాండ్ లో తగరపువలస స్వీట్లు కనిపించడమంటే..? మామూలు విషయం కాదంటున్నారు మరి కొంతమంది.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: