Monday, 15 June 2026 07:34:27 PM

బాల్య వివాహాలు వద్దు. ఆడపిల్లలకు చదువే ముద్దు

Date : 27 November 2024 08:08 PM Views : 2548

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : నవంబర్ 27 సాక్ష్యం న్యూస్: బాల్య వివాహాలు వద్దు..ఆడపిల్లకు చదువే ముద్దు,, అనే నినాదంతో భీమునిపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..,,బుధవారం భీమునిపట్నం ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థిని విద్యార్థులు మరియు అంగన్వాడీ, టీచర్లతో ప్రజల్లో అవగాహన కలిగిస్తూ.. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమిలి గంట స్తంభం వద్ద మానవ హారం చేపట్టి నినాదాలు చేశారు. అంతకుముందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు ఈ కార్యక్రమాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంబించగా... 1st మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ సౌజన్య ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు... వయస్సు వచ్చిందని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి చేతులు దులుపేసుకునే సాంప్రదాయాన్ని తల్లిదండ్రులు విడిచిపెట్టాలని...వారిని చదివించి ఉన్నత స్థితికి చేర్చడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారవుతారని గుర్తు చేశారు.ఈ కార్యక్రంలో బార్ అసోసియేషన్,అధ్యక్షులు పార్వతీశం కార్యదర్శి, K.S.M సుధాకర్, సీనియర్ న్యాయవాదులు గౌతమ్, సుందర్ సింగ్, బోని శివ, కనకమహాలక్ష్మి అప్పల రాజు, మురళీ, నమ్మి సూరి బాబు, మాజీ కౌన్సిలర్,మైలపల్లి లక్ష్మణ రావు,జూనియర్ కళాశాల సిబ్బంది, పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :