Friday, 19 June 2026 01:30:25 PM

పారిశుధ్య కార్మిక మహిళలకు సన్మానం

Date : 08 March 2025 06:04 PM Views : 1610

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 8 సాక్ష్యం న్యూస్,(భీమునిపట్నం): కుటుంభంలో వివిధ పాత్రలు పోషించే మహిళ ఈరోజు అన్ని రంగాలలో ముందుంటోందని..మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గోస్తనీ విద్యాసంస్థల అధినేత కాళ్ళ సూరిబాబు అన్నారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక గొస్థనీ విధ్యాపీఠ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెల్లిగా,అక్కగా,కూతురిగా, తల్లిగా,ఇలా ఎన్నో పాత్రలు పోషిచే మహిళ వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం ఇలా..అన్ని రంగాలలో మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా ముందడుగు వేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తాలాడ పాప, Mptc లక్ష్మి తోపాటు పారిశుధ్య కార్మిక మహిళలను, ఉపాధ్యాయిని లను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోస్తనీ విద్యా పీట్ డైరెక్టర్ కాళ్ళ మనోహర్, ప్రధాన ఉపాద్యాయులు M.పైడిరాజు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: